Tuesday, December 2, 2008

02-12-2008 ఈనాడు

.
తత్కాల్ రాయటానికి ఒకసారి సరిగ్గానే రాశారు..రెండో సారి తాత్కాల్ మరలా మూడవ సారి అదే తప్పు...ఎవరండీ ఈనాడు కంటెంటు ఎడిటరు ....

10 comments:

నిజం said...

mari anyamandi edo okasari mistake chesthe antha mata avsarama.eenadu gurinchi manaku theliyada.edo oka mistake chesinantha matrana.....proof reader evadu andamena.

VIJAYABHASKAR said...

బుచ్చి బాబు గారు మీరు మీ స్పందన ని మాత్రు భాష లో చేస్తే బాగుండేది.....ఒక తప్పు రెండు తప్పులు అని ఉండవండీ.పైగా ఆ వార్త లో రెండు తప్పులు ఉన్నాయి

నాగప్రసాద్ said...

@విజయభాస్కర్ గారు, చిన్న అచ్చు తప్పును పట్టుకుని అంతలేసి మాటలనడం భావ్యం కాదనుకుంటా.

అంతెందుకు, పైన మీరు వ్రాసిన వ్యాఖ్యను ఒకసారి పరిశీలించండి. "మాతృభాష" అని వ్రాయడానికి బదులు "మాత్రుభాష" అని వ్రాశారు. ఈ మాత్రం దానికి మిమ్మల్ని తెలుగును ఖూని చేస్తున్నారు అనవచ్చునా.

please remove word verification.

a smile said...

హలో సర్,
మీరు మరి తప్పులు చూడడమే పనిగా పెట్టుకుంటే చేయగలిగింది ఏమి లేదు...
మీకు తెలుసా... ప్రతి ఒక్క సబ్ ఎడిటర్ దాదాపు ౧,౦౦,౦౦౦ అక్షరాలు సరిచుడాల్సి ఉంటుంది... ప్రస్తుతం పెరిగిన పని వత్తిడి లో కొన్ని తప్పులు రావడం సహజమే..కానీ...పాఠకుడికి విషయం అర్థం ఐండ..కాలేదా..అన్నదే ప్రధానం....అర్థం చేసుకోండి....

a smile said...

తప్పులు వెతికే వాడు అసమర్థుడు. ఒకసారి పరమహంస ని చూడు. అంతా తప్పే. కానీ ఒక లెజెండ్. భావాన్ని గ్రహించాలి. నువ్వు ఒకసారి ఏదైనా పత్రికలో పనిచేయి. తెలుస్తూంది. ఆవకై బిర్యాని చూడు. చాల బాగుంది. అవకై ఏంటి, బిర్యాని ఏంటి, అని అనలిజే చియకు. జస్ట్ చూడు. ఎంజాయ్ చేయి.

రమణ said...

మాత్రు మరియు మాతౄ అచ్చుతప్పు పాపం విజయ్ గారిది కాదు అనుకుంటా , అది తొందరలొ టైప్ చెసిన సాఫ్ట్ వేర్ ది అనుకుంటా!!!

kiraN said...

తప్పు తప్పే..
"ఈనాడు" లో ఈ మధ్య వార్తల్ని పూర్తిగా(దాదాపుగా) తెలుగులోనే రాస్తున్నారు. అంటే ఒకప్పుడు 'రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్' అని రాసేవారు కాని ఇప్పుడు 'గ్రామీణాభివృద్ధి అధికారి' అని రాస్తున్నారు. ఇటువంటి ఎన్నో పదాలని తెలుగులోనే రాస్తున్నారు.
ఇది ఎంతో ఆహ్వానించదగ్గ విషయం.

వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి

- కిరణ్
ఐతే OK

సుజాత వేల్పూరి said...

వార్తల్లో తప్పులు రాకుండా చూడడం సబెడిటర్ పని. అది ఒక ఉద్యోగ బాధ్యత. అతడు/రోజుకు ఎన్ని అక్షరాలు చూడాలి అన్నదానితో చదువరులకు సంబంధం లేదు. సబెడిటర్ సరిగా ఉన్నాడా లేదా చూడడం న్యూసెడిటర్, లేదా కంటెంట్ ఎడిటర్ పని. తప్పుల తడకలని చదవడానికా డబ్బులిచ్చి పేపర్ కొనేది?

అందరితో పోలిస్తే ఈనాడులో తప్పులు తక్కువనే చెప్పాలి. రూరల్ లో ఉండే స్ట్రింగర్ల కు కొంచెం భాషా పరిజ్ఞానం తక్కువ కాబట్టి, మఫిసిల్ ఎడిషన్లలో తప్పులకు అవకాశం ఎక్కువ. జిల్లా డెస్కులలో సమర్థులైన సబెడిటర్లు ఉంటే దీన్ని నివారించవచ్చు.

శవాన్ని తీసుకొస్తున్న ఒక వాహనానికి ప్రమాదం జరిగి లోపల ఉన్న శవం వెళ్ళి తుప్పల్లో పడింది. దీనికి విలేకరి పెట్టిన హెడ్డింగ్ ఏమిటో ఊహించండి."మళ్ళీ మరణించిన శవం"! ఇలాంటి అసంబద్ధమైన న్యూసులు కూడా వస్తుంటాయి. పోటీ ప్రపంచంలో త్వరగా పని చేయాల్సిన పరిస్తితుల్లో తప్పులు అనివార్యమైపోయాయి.

మాతృభాష అని రాయడం మొదట్లో నాకూ తెలిసేది కాదు. t పక్కన capital R రాస్తే వస్తుంది.

VIJAYABHASKAR said...

మితౄలారా ...నా ప్రయత్నాన్ని విమర్శించిన వారి లో చాలా మంది ఆ దిన పత్రిక లో పని చేస్తుండవచ్చు....నేను పనిగట్టుకొని ఈనాడు ని ఎందుకు లక్ష్యం గ తీసుకొన్నానో తెలుసా ....గతం లో ఉన్న భాషా విలువలు ఇప్పుడు లేవు ....సుజాత గారికి ధన్యవాదములు...నా బ్లాగు ని పైసా ఖర్చు లేకుండా చదవొచ్చు..మరి ఆ నా అభిమాన పత్రిక ని ఉచితం గా ఇస్తారా...డబ్బులు పెట్టి కొని చదువుతున్నాను అండీ... ఇంకో విషయం..ఇది కేవలం పత్రిక లోని లోపాలని ఉద్దేశించినది... నాకు ఆ పత్రిక తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధమూ లేదు....

నాగప్రసాద్ said...

@VIJAYABHASKAR గారు, నేను ఈనాడు పత్రికలో పని చేయడం లేదు. మీ బ్లాగుని ఎలాగైతే పైసా ఖర్చులేకుండా చదువుతున్నానో, ఈనాడు దిన పత్రికని కూడా అంతర్జాలంలో ఉచితంగా చదువుతున్నాను.

మీ గత జాబులు కొన్ని చూశాను. అన్ని జాబుల్లోనూ కేవలం ఈనాడు దినపత్రికలోని ముద్రారాక్షసాలను బయటపెట్టారు. అంటే తెలుగులో కేవలం ఒకే ఒక "ప్రముఖ దినపత్రిక" వుందా, లేకపోతే మిగతా పత్రికల్లో ముద్రారాక్షసాలు అస్సలు లేవా.