Subscribe to:
Post Comments (Atom)
మిత్రులారా ......వాళ్లు రాసింది చదవటం తప్ప పాఠకులకు ఎలాంటి జవాబుదారి తనం చూపని ఈ నాటి దిన పత్రికలు ముఖ్యం గా తెలుగు లో అత్యధిక సర్ క్యు లే షన్ ఉన్న వాటి లో వస్తున్న ముద్రా రాక్షసాల గురించి మీరే చూడండి...మీ స్పందనలు ఇస్తే అది నాకు ప్రోత్సాహం
మిత్రులారా ......వాళ్లు రాసింది చదవటం తప్ప పాఠకులకు ఎలాంటి జవాబుదారి తనం చూపని ఈ నాటి దిన పత్రికలు ముఖ్యం గా తెలుగు లో అత్యధిక సర్ క్యు లే షన్ ఉన్న వాటి లో వస్తున్న ముద్రా రాక్షసాల గురించి మీరే చూడండి...మీ స్పందనలు ఇస్తే అది నాకు ప్రోత్సాహం
1 comment:
విజయ భాస్కర్ గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు.
ఈనాడు ఇదివరలో ఇన్నితప్పులతో వార్తలు రాసేది కాదు. వార్తలో చెప్పలేనన్ని తప్పులుండేవి. జిల్లా ఎడిషన్ల సంగతి చెప్పక్కర్లేదు. బూతులంటే నమ్మండి. జిల్లా ఎడిషన్ల కంట్రిబూటర్ల విద్యార్హత పదో క్లాసు. వాళ్ళకి జీతం సెంటీమెటర్ కి ఇంతని ఇస్తారు(పబ్లిష్ అయిన వార్తని కొలిచి) మరి పదో తరగతి విద్యార్హతతో నాణ్యమైన న్యూస్ ఏం రాస్తారు చెప్పండి. వాళ్ళు రాసిన వార్త ని డెస్క్ లో ఉండే వాళ్ళు సంస్కరించాలి.
మొదట రిపోర్టర్ల కి మంచి భాష ఉందా లేదా, (మన వాళ్ళు రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు) అనే విషయం గురించి మంచి ఎసెస్మెంట్ జరగాలి. ట్రైనింగ్ వల్ల ఎంతో కొంత మెరుగుదల ఉన్నా, అసలు భాషా పరిజ్ఞానమే లేని వాడికి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఏం లాభం చెప్పండి.
మీరు ఇంకోటి గమనించారా! ఈనాడు తనకి ఉన్న మోనోపొలీ తో తెలుగులో కొత్త కొత్త పదాలను కనిపెట్టి అవి ప్రామాణికమైనవని వాదిస్తుంది. 'ఫలానా వాడు సమర్థ వంతంగా పని చేసాడు ' అని రాయడానికి 'సమర్థంగా ' అని రాస్తాడు ఈనాడు సబెడిటరు. ' సచిన్ తో సహా పది మంది ' అనరు. సచిన్ సహా పది మంది అంటారు. ఇవి కేవలం ఈనాడు కనిపెట్టిన మాటలే! మిగతా పత్రికలు గుడ్డిగా ఈనాడు వెనకే పయనిస్తాయి.
మనలాంటి వాళ్ళు ఇటువంటి తప్పుల్ని ఉపేక్షించకుండా, ఎత్తి చూపుతుండాలి మాటి మాటికీ! అప్పుడే కొంతైనా మార్పు వస్తుంది.
Post a Comment